ETV Bharat / state

కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు ఆపన్నహస్తం - చిల్పూర్ మండలం మల్కాపూర్‌లో కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ

జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు.

kadimi foundation distributed grocery in malkapur chilpur mandal janagam
కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు ఆపన్నహస్తం
author img

By

Published : May 7, 2020, 12:20 PM IST

లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు, నిరుపేదలకు తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, పారిశుద్ధ్య కార్మికులకు చేయూత ఇందించారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చేతుల మీదగా వాళ్లకు బియ్యం, నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించి... కరోనా వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎడవల్లి కృష్ణ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: మెట్రో.. ఇప్పట్లో అనుమానమే!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.