Valmidi Ramalayam Jangaon : చుట్టూ పచ్చని పొలాలు.. ఎటుచూసినా ఆహ్లాదకరమైన వాతావరణం.. స్వచ్ఛమైన గాలి.. ప్రశాంతతకు మారుపేరుగా దేవస్థానం. మనసు పులకరించే పల్లే అందాల నడుమ ఆ రామ్మయ్య దేవస్థానం చక్కటి అందాలతో రూపుదిద్దుకుంది. రామాయణాన్ని రచించిన వాల్మికి కొంతకాలం అక్కడే నివశించారని ప్రతీతి. అలాంటి వైభవోపేత దేవస్థానాన్ని వచ్చే నెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఆధ్యాత్మిక వేత చినజీయర్ స్వామి ప్రారంభించనున్నారు. ఈ ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యవేక్షిస్తున్నారు. ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు రానున్నారని తెలిపారు.
Jangaon Lord Ram Temple : జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో పునర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయం నయనానందకరంగా నిలుస్తోంది. 50 ఎకరాల సువిశాలమైన గుట్టపై రాముడు స్వయంభువుగా వెలిశాడని భక్తుల విశ్వాసం. రామాయణాన్ని రచించిన వాల్మీకి కొంతకాలం ఇక్కడ ఉన్నారని ప్రతీతి. గతంలో స్వామి దర్శనానికి వెళ్లాలంటే సరైన మార్గం కూడ ఉండేది కాదని భక్తులు చెబుతున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక చొరవతో ఆలయ అభివృద్ధికి నోచుకుంది. రూ.25 కోట్లతో కొండపైకి మెట్లు, స్వాగత తోరణం, దేవస్థానం చుట్టూ ప్రహారీ, కనమదారి, భక్తులు సేదతీరేందుకు కుటీరాలు ఏర్పాటు చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా చరిత్రత్మాక కట్టడాలను పునఃనిర్మాణం చేపడుతుంది.
పరమ పవిత్రం వైకుంఠ పర్వదినం.. ఉత్తర ద్వార దర్శనం... సర్వదా శుభదాయకం
వచ్చే నెల 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు చినజీయర్ స్వామి ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఆలయ ప్రారంభానికి ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయకర్‌రావు దేవస్థాన ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. భద్రాద్రి, అయోధ్య దేవస్థానల తరహాలో ఈ ఆలయం అభివృద్ధి చేసినట్టు మంత్రి తెలిపారు. వచ్చే నెల1 నుంచి 4వ తేదీ వరకు దేవాలయంలో ఉత్సవాలను నిర్వహించనున్నారు. దేవాలయం పునఃప్రారంభం సందర్భంగా భక్తులను ఆహ్వానించేందుకు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు ప్రచార రథాలను సిద్ధం చేశారు.
" తెలంగాణ ప్రజలు తెలుగువారు ప్రతి ఒక్కరు వల్మిడి గుడి ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. వల్మిడికి ఒక వైభవం ఉంది. అయోధ్యకు, భద్రాచలం రామయ్యకు ఎంత చరిత్ర ఉందో దీనికి అంత విశిష్టత ఉంది. 4వ తేదీన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. చిన్నజీయర్ స్వామి వస్తారు. వారి చేతులమీదగానే విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి. శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాఠోడ్ వస్తున్నారు. తదుపరి కార్యక్రమం కల్యాణం ఉంటుంది." - ఎర్రబెల్లి దయాకర్‌రావు, మంత్రి.
తుదిదశకు మహాసంప్రోక్షణ ఏర్పాట్లు.. యాదాద్రికి చేరుకున్న స్వర్ణ, రాగి కలశాలు