భాజపా ఫ్లెక్సీలు తొలగించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు జనగామ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తెరాస ఫ్లెక్సీలు తొలగించకుండా భాజపా జెండాలు మాత్రమే తొలగించారని నిరసన వ్యక్తం చేశారు.
పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వహించకుండా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలో భాజపా కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు.
- ఇదీ చూడండి : కేసీఆర్ మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తారు: తలసాని