ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ను తమ కుటుంబ పెద్దగా భావిస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో 23 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
అనంతరం రంగప్ప చెరువులో చేప పిల్లలను వదిలారు. మత్స్య కారులకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసి ఆర్థికంగా సాయమందిస్తున్నామని తెలిపారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసి కేసీఆర్కు కానుక ఇవ్వాలన్నారు.
- ఇదీ చూడండి : కీర్తి క్రిమినల్ ఎందుకయింది?