ETV Bharat / state

గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన జనగామ కలెక్టర్‌ - జనాగమ జిల్లా తాజా వార్తలు

గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో జనగామ జిల్లా కలెక్టర్ నిఖిల భాగస్వాములయ్యారు. వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాష విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి జనగామ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి మూడు మొక్కలను నాటారు. అనంతరం ముగ్గురిని నామినేట చేసి వారు కూడా మూడు మొక్కలు నాటాలని కోరారు.

గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన జనగామ కలెక్టర్‌

author img

By

Published : Aug 29, 2020, 10:04 AM IST

ఎంపీ సంతోశ్‌ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో జనగామ జిల్లా కలెక్టర్ కే. నిఖిల భాగస్వాములయ్యారు. వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాష విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి జనగామ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి మూడు మొక్కలను నాటారు. అనంతరం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధి హనుమంతు, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, వరంగల్ మున్సిపల్ కమీషనర్ పమేలా సత్పతిలను నామినేట్‌ చేసి.. వారు కూడా మూడు మొక్కలు నాటాలని కోరారు.

ఎంపీ సంతోశ్‌ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్‌ నిఖిల తెలిపారు. చాలా మంది సెలెబ్రిటీలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారని.. జనగామ జిల్లా అధికారులు కూడా వారి ఇళ్లలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. అందరి భాగస్వామ్యంతో హరిత తెలంగాణ సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: 'లెక్కలేనన్ని.. మరెవరూ సాధించలేనన్ని విజయాలతో ఈటీవీ పాతికేళ్ల పండుగ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.