ETV Bharat / state

ఓరుగల్లులో కారు జోరు.. అందరూ గులాబీ ఛైర్మన్లే

వరంగల్  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు ఛైర్మన్ పీఠాలనూ తెరాస దక్కించుకుని.. జిల్లాలో తనకు ఎదురే లేదని మరోసారి నిరూపించుకుంది.

పాగాల సంపత్ రెడ్డి
author img

By

Published : Jun 8, 2019, 7:57 PM IST

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆరు ఛైర్మన్ పీఠాలను తెరాస కైవసం చేసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా జడ్పీ ఛైర్మన్​గా మారేపల్లి సుధీర్ కుమార్, వైస్ ఛైర్మన్​గా శ్రీరాములు ఎన్నికయ్యారు. వరంగల్ గ్రామీణ జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్​గా గండ్ర జ్యోతిని ఎన్నుకున్నారు. వైస్ ఛైర్మన్ పదవిని ఆకుల శ్రీనివాస్ చేపట్టారు.

అందరూ గులాబీ ఛైర్మన్లే
అందరూ గులాబీ ఛైర్మన్లే

జనగామ జిల్లా పరిషత్ ఛైర్మన్ గా.. పాగాల సంపత్ రెడ్డి, వైస్ ఛైర్మన్​గా గిరబోయిన భాగ్యలక్ష్మి ఎన్నికయ్యారు. మహబూబూబాద్ జిల్లా పరిషత్ ఛైర్మన్ గా.. ఆంగోతు బిందు, వైస్ ఛైర్మన్ గా.. వెంకటేశ్వరరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ములుగు జిల్లా పరిషత్ పీఠం.. ఏటూరి నాగారం జడ్పీటీసీ కుసుమ జగదీశ్​ని వరించింది. వైస్ ఛైర్మన్​గా.. బడే నాగజ్యోతి ఎన్నికయ్యారు. జయశంకర్ భూపాలపల్లిలో జక్కు శ్రీహర్షిని జిల్లా ఛైర్​పర్సన్​గా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలి పదవి కల్లెపు శోభను వరించింది. ఎన్నిక ముగిసిన వెంటనే తెరాస నేతలు, కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఇవీ చూడండి: 32 జడ్పీ స్థానాల్లో జెండా ఎగురవేసిన తెరాస

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.