రైతులు యాసంగికి సిద్ధం కావాలి: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రైతులందరు నీటి లభ్యత దృష్టిలో పెట్టుకొని యాసంగి సాగుకు సిద్ధం కావాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సూచించారు. జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. దళారులను నమ్మి మోసపోకూడదని.. ప్రభుత్వ కేంద్రాల్లోనే పంటను అమ్మి మద్దతు ధర పొందాలన్నారు.
జనగామలో గతంలో కంటే అధిక పంట దిగుబడి సాధిస్తున్నారని.. అది ముఖ్యమంత్రి రైతు పక్షపాత ధోరణి వల్లే సాధ్యమైందని ఎమ్మెల్యే అన్నారు. గోదావరి జలాలతో నియోజకవర్గంలోని అన్ని చెరువులు నింపామని.. అన్నదాతలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇవీచూడండి: టీ హబ్లో ఎన్పీసీఐ ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రారంభం