అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా.. మార్చి8న రంగారెడ్డి జిల్లా కొంగరకలన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బలహీన వర్గాల యుద్ధభేరి మహాసభ నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. జనగామ జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మహిళలపై నిత్యం జరుగుతున్న అత్యాచారాలు.. ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి నిరసనగా యుద్ధభేరి మహాసభను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: ఫలితాలపై టెన్షన్ టెన్షన్...కోట్లలో బెట్టింగ్..