జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 34వ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెడతామన్నారు. ఆమె ఆశయాలను సాధిస్తామని తెలిపారు.
ఇదీచూడండి: రైతు సమస్యలపై శాసనసభలో పోరాటం: సీఎల్పీ