కరోనా వైరస్ నేపథ్యంలో జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచుప్పుల, కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి, రఘనాథపల్లి మండలం కంచనపల్లి తదితర గ్రామాల్లో రెండవ రోజు ఐదు ఐసీఎంఆర్ బృందాలు పర్యటించాయి. ర్యాండమైజేషన్ పద్ధతిలో గ్రామంలో 18 నుంచి 70 ఏళ్ల మధ్యనున్నవారికి పరీక్షలు నిర్వహించడానికి రక్త నమూనాలు సేకరించారు.
ఈ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో కరోనా ప్రభావాన్ని అంచనా వేసి తదుపరి చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం.. మరిన్ని వ్యూహాలు రూపొందించే అవకాశముంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 400 మందికి పరీక్షలు చేయనున్నారు. కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని... భౌతిక దూరం పాటించాలని గ్రామస్థులకు సూచించారు.
ఇవీ చూడండి: తెల్లారిన బతుకులు..రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి