Harishrao Fires on Congress : జమిలి ఎన్నికల (Jamili Elections) కోసం వేసిన కమిటీలో దక్షిణాది రాష్ట్రాల వారికి చోటు కల్పించకపోవడం బాధాకరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. జమిలి వచ్చినా.. ఏం జంబ్లింగ్ చేసినా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. జనగామ జిల్లా వల్మిడికి వచ్చిన ఆయన.. శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. చినజీయర్ స్వామి చేతుల మీదుగా ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.
Harishrao fires on Congress Declaration : అనంతరం పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తన శైలీలో విమర్శలు చేశారు. డిక్లరేషన్ల (Congress Declarations) పేరుతో కాంగ్రెస్ కొత్త నాటకాలకు తెరలేపుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తీరు చెల్లని రూపాయి చందంగా మారిందని హరీశ్‌రావు విమర్శించారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసిన.. వచ్చే శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) హ్యాట్రిక్ సాధించి కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని ధీమ వ్యక్తం చేశారు.
One Nation One Election : జమిలి ఎన్నికలపై కసరత్తు షురూ.. ప్రజలకు ఒరిగేదేంటని విపక్షాల ప్రశ్న
Harishrao Fires on BJP : ఈ సందర్భంగా బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. దేశంలో బీజేపీ పరిస్థితి బాగాలేదని.. ఓడిపోతామన్న భయం ఆ పార్టీలో పట్టుకుందన్నారు. అందుకే ఎన్నికల వేళ జమిలి డ్రామాలకు తెరలేపారని హరీశ్‌రావు ఆరోపించారు. జమిలి ఎన్నికల కోసం వేసిన కమిటీలో దక్షిణాది వారికి చోటు కల్పించకపోవడం కేంద్ర వివక్షకు నిదర్శనమని హరీశ్‌రావు అన్నారు. ప్రజలు అబద్దాల ఉచ్చులో పడి మోసపోవద్దని ఈ సందర్భంగా సూచించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) కోరిక మేరకు పాలకుర్తి మండలానికి త్వరలోనే 50 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తున్నట్లు హరీశ్‌రావు ప్రకటించారు.
"ఓటమి భయంతోనే బీజేపీ జమిలి ఎన్నికలకు సిద్ధమయింది. జమిలి కమిటీలో దక్షిణ భారత్‌కు అవకాశమే ఇవ్వలేదు. దక్షిణ భారతదేశం పట్ల బీజేపీ వివక్షత చూపుతోంది. బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసిన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీదే అధికారం. కేంద్రంలోనూ బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది. అబద్దాల ఉచ్చులో ప్రజలు పడొద్దు. కేసీఆర్ మరోసారి సీఎం అయితేనే అభివృద్ధి, సంక్షేమం. జమిలి వచ్చినా.. ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలుపు బీఆర్ఎస్దే." - హరీశ్‌రావు, వైద్యఆరోగ్య శాఖ మంత్రి
Harish Rao on BJP and Congress : 'బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రానికి శాపంగా మారాయి'