ETV Bharat / state

ఈటీవీ కథనానికి స్పందన... మాజీ క్రీడాకారునికి ఆర్థికసాయం - మాజీ క్రీడాకారునికి ఆర్థిక సహాయం

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాళ్లు చచ్చుబడిపోయి మంచానికే పరిమితమైన వాలీబాల్​ మాజీ క్రీడాకారుడికి గద్వాల జిల్లా మోటార్​ వెహికల్​ ఇన్​స్పెక్టర్​ ఆర్థిక సాయం అందించారు. అనిల్​ దీనగాథపై ఈటీవీలో వచ్చిన కథనానికి స్పందించిన ఘంటా రవీందర్​ రూ. పదివేలు ఆర్థిక సాయం చేశారు.

gadwal motor vehicle inspector financial assistance to volleyball player who was injured at jangaon
ఈటీవీ కథనానికి స్పందన... మాజీ క్రీడాకారునికి ఆర్థికసాయం
author img

By

Published : Sep 24, 2020, 6:02 PM IST

జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన శాతపురం అనిల్ ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు చచ్చుబడి మంచానికే పరిమితమయ్యాడు. వాలీబాల్​ క్రీడాకారుడిగా జట్టుకు ఎన్నో విజయాలు అందించిన అనిల్​ పరిస్థితిపై ఈటీవీలో వచ్చిన కథనానికి గద్వాల మోటార్​ వెహికల్​ ఇన్​స్పెక్టర్ ఘంటా రవీందర్ స్పందించారు.

ఇవాళ బాధితుడు అనిల్​కు రూ. పదివేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనిల్​ను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రవీందర్​ కోరారు.

ఇదీ చదవండిః 'ప్రైవేటు ఉపాధ్యాయులను, అధ్యాపకులను ప్రభుత్వం ఆదుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.