కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి.. ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా నియంత్రణలో ఆశా వర్కర్లు ఆశాకిరణాలుగా వ్యవహరించారని ప్రశంసించారు.
వైద్య సిబ్బందికి తోడు ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య సిబ్బంది చేసిన సేవలు వెలకట్టలేనివని కడియం అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య వివరాల సేకరణే కాకుండా అప్రమత్తంగా ఉండాలని వారికి సూచనలు చేశారని తెలిపారు.