లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలను బయటకు రాకుండా 42 రోజుల నుంచి పహారా కాస్తున్న పోలీసుల సేవలను మర్చిపోలేమని జనగామ జిల్లా భాజపా అధ్యక్షుడు దశమంత్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న పోలీసుల రక్షణ కొరకు ప్లాస్టిక్ ఫేస్ మాస్కులను ఏసీపీ వినోద్‌కు అందజేశారు. లాక్డౌన్ సందర్భంగా పోలీసులు నిరంతరం పని చేస్తున్నారని... వారిని రక్షించుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని దశమంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఉదారతను చాటుతున్న మానవతావాదులు