వివిధ నిర్మాణాల కోసం మట్టిని తవ్వుతుంటే గతంలో వాడిన పలు పరికరాలు బయట పడుతుంటాయి. అలానే జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరిలో రాతియుగం నాటి పరికరాలు బయటపడ్డాయి. గోపాల స్వామి గుట్ట దిగువన ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా నీటి నిలువ కందకాలు తవ్వుతుండగా ఆది మానవుల కాలంనాటి చరిత్రకు సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయని పురావస్తు పరిశోధకుడు రత్నాకర్ రెడ్డి తెలిపారు .
బంగారు రంగు చెవిపోగు, దారం పెట్టడానికి వాడే స్పైండిల్ ఓర్ల్, చేతితో కాల్చిన ఎర్రటి మట్టిపాత్ర, రాతి గొడ్డలి, కొయ్యడానికి వాడే రాతి పరికరాలు, మట్టి పాత్రలు, లోహ వస్తువులు లభించాయని రత్నాకర్ రెడ్డి చెప్పారు. శిలా యుగంలోని నాలుగు దశలు... పాత రాతి, సూక్ష్మ రాతి, కొత్త రాతి, బృహత్ శిలా యుగానికి చెందిన కుమ్మరి, చేనేత పరిశ్రమ ఆనవాళ్లు ఒకే చోట లభించడం విశేషమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: డ్రైవర్‌కు కరోనా... హోం క్వారంటైన్లో జీహెచ్ఎంసీ మేయర్ కుటుంబం