తన భార్యపై అవినీతి ముద్ర వేసి, ఎలాంటి ఆధారాలు చూపించకుండా.. సమాధానం చెప్పకుండా డీఆర్డీఓ పీడీ రాంరెడ్డి దాటవేత ధోరణిని అవలింబిస్తున్నారని చాడ ఎలియా అన్నారు. ఆయనతో పాటు పలువురు స్టేషన్ ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామస్థులు కలెక్టరేట్ ఎదుట డీఆర్డీఓను అడ్డుకున్నారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తమపై నిందారోపణ చేసిన సొమ్మును చెల్లిస్తామని.. ఆధారాలు చూపించేదాక ఇక్కడి నుంచి వెళ్లేది లేదని ఆయనతో వారించారు. ఈ నెల 25న గ్రామానికి వచ్చి దీనిపై సమగ్ర విచారణ చేస్తామని రాంరెడ్డి చెప్పగా.. వారు శాంతించారు.
"తాటికొండ గ్రామంలో మహిళా సంఘాల తరఫున మహోదయ గ్రామైక్య సంఘానికి సీఏగా నా భార్య పనిచేస్తోంది. నా భార్య లక్షల రూపాయలు దుర్వినియోగానికి పాల్పడినట్లు డీఆర్డీఓ పీడీ రాంరెడ్డి ముద్ర వేశారు. ఎలాంటి ఆధారాలు చూపించకుండా మమ్మల్ని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. నా భార్యపై కావాలనే కొందరు ఇలా చేయిస్తున్నారు. రెండు విడతల్లో ఆడిట్ నిర్వహించగా ఏ ఒక్కదానికి సరైన ఆధారాలు చూపించలేదు."
- చాడ ఎలియా, బాధితురాలి భర్త
ఇదీ చూడండి: ఔటర్ రింగ్‌రోడ్‌పై ప్రమాదం.. 25 మందికి గాయాలు