DK Shivakumar Election Campaign in Telangana : రాష్ట్రంలో పోలింగ్ సమయం దగ్గరపడటంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. పార్టీ అగ్ర నేతలతో ముమ్మరంగా రోడ్ షోలు, సభలతో ప్రచార హోరు జోరుగా కొనసాగుతుంది. అందులో భాగంగానే కాంగ్రెస్‌కు మద్దతుగా కర్ణాటక(Karnataka) ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణకు వచ్చారు. ఇవాళ ఆయన జనగామ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘన్‌పూర్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.
Congress Election Campaign in Telangana : సభలో డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ నాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని పేర్కొన్నారు. 2018 శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు పరచలేదన్నారు. రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్ రూంలు(Double Bed Room) ఇచ్చారు? రైతులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఏమయ్యాయి అంటూ శివకుమార్ ప్రశ్నించారు. రాబోయే 5 ఏళ్ల భవిష్యత్ కోసం మనం పరీక్షకు వెళుతున్నామని.. మీరు ఎవరికి మార్కులు వేస్తారో.. మీరే నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
పార్టీ ఫిరాయించిన 12 మందికి - ఈ ఎన్నికల్లో కార్యకర్తలు బుద్ధి చెప్పాలి : రేవంత్ రెడ్డి
ప్రజా ప్రభుత్వాలకు ఐదేళ్లకు వచ్చే ఎన్నికల పరీక్షల్లో ప్రజలు అప్రమత్తంగా ఓటు అనే మార్కును వేసి సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. దేశ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశంలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. ఆ అవినీతి సీఎం వల్లే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు కుంగింది. రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. అటువంటి కేసీఆర్‌ను పర్మినెంట్‌గా ఓడించి.. ఫాంహౌస్‌కు అంకితం చేయాలని ప్రజలను నేను అభ్యర్థిస్తున్నాను. ఇవాళ మార్పుకోసమే ఎన్నో రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి.-డీకే శివకుమార్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి
DK Shivakumar Challenge to KCR&KTR : దేశంలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని దేశ ప్రధాని నరేంద్ర మోదీనే(PM Modi) చెప్పారన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ను ఓడించి.. పర్మినెంట్‌గా ఫాం హౌస్‌లో ఉంచాలని డీకే పిలుపునిచ్చారు. తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి రావాలని సీపీఐ, వైఎస్సార్టీపీ మద్దతిస్తున్నాయని తెలిపారు. డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు(Six Guarantees) తప్పక అమలు చేస్తామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారంటీలు అమలవుతున్నాయో లేదో తెలుసుకొని మాట్లాడాలని కేసీఆర్, కేటీఆర్‌లకు సవాలు విసురుతున్నానన్నారు.
దుబ్బాక నిధులను మామా, అల్లుళ్లు సిద్దిపేటకు ఎత్తుకుపోవడం అలవాటైపోయింది : రేవంత్‌రెడ్డి
మళ్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన పునరావృతం : ఏఐసీసీ అధ్యక్ష పదవిలో ఒక దళితుడిని కూర్చోబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదని డీకే స్పష్టం చేశారు. తమ రాష్ట్రంలా.. తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలను నిలబెట్టని కేసీఆర్(CM KCR) ప్రభుత్వం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన మొదటి రోజే ఆరు గ్యారెంటీల హామీలపై సంతకం చేస్తుందని సోనియా, రాహుల్, ఖర్గే తరఫున చెబుతున్నానన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి.. మళ్లీ రాష్ట్రమంతా పునరావృతమౌతుందని డీకే శివకుమార్ పేర్కొన్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభ్యర్థి సింగపురం ఇందిర తక్కువ ఓట్లతో గతంలో ఓడిపోయారని.. ఈ దఫా అలా కాకూడదన్నారు. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కాంగ్రెస్ - రంగంలోకి దిగుతున్న అగ్రనేతలు
బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలెవరూ సంతోషంగా లేరు : ప్రియాంక గాంధీ