ETV Bharat / state

గొర్రెల పంపిణీలో జాప్యం.. 16న రోడ్ల దిగ్బంధనం - jangaon district latest news

రెండో విడత రాయితీ గొర్రెలను పంపిణీ చేయడంలో కొనసాగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఈనెల 16న రోడ్ల దిగ్బంధనం చేయనున్నారు. ఈ అంశంపై జనగామలో గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు.

Delay in distribution of sheep road blockade on 16th at jangaon
గొర్రెల పంపిణీలో జాప్యం.. 16న రోడ్ల దిగ్బంధనం
author img

By

Published : Mar 14, 2020, 5:58 PM IST

రెండో విడత రాయితీ గొర్రెలను పంపిణీ చేయడంలో కొనసాగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఈనెల 16న దిగ్బంధనం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేష్‌ పేర్కొన్నారు.

స్థానిక సంఘం కార్యాలయంలో జనగామ, బచ్చన్నపేట, లింగాల ఘనపురం మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని అనిల్‌ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. రాయితీ గొర్రెల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది గొల్ల కురుమలు డీడీలు తీసి, 18 నెలలు గడుస్తున్నా ఇంత వరకు ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేయడం లేదని మల్లేష్‌ అన్నారు. రోడ్ల దిగ్బంధనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాజు, సమ్మయ్య, రమేష్‌, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : పారాసెటమాల్​తో కరోనా తగ్గదు: జీవన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.