ETV Bharat / state

జనగామ మున్సిపల్ కమిషనర్​కు కరోనా పాజిటివ్ - జనగామ కరోనా వార్తలు

జనగామ జిల్లాలో గురువారం నాడు 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్​కు వైరస్​ సోకినట్టు వైద్యాధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్​డౌన్ పాటిస్తున్నారు.

జనగామ మున్సిపల్ కమిషనర్​కు కరోనా పాజిటివ్

author img

By

Published : Jul 24, 2020, 5:17 AM IST

జనగామ జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. కొన్ని రోజులుగా 10 కంటే తక్కువ కేసులు నమోదు అవుతుండగా... గురువారం ప్రకటించిన హెల్త్ బులిటెన్​ ప్రకారం 22 కేసులు నమోదయ్యాయి. తాజాగా జనగామ మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్ యాదవ్​కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తుండటం వల్ల జిల్లాలో పలు చోట్ల వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్​డౌన్ పాటిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే దుకాణాలను తెరుస్తున్నారు. ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 50 వేలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.