Clash between TRS and BJP: ఆంధ్రప్రదేశ్ విభజనపై పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెరాస, కాంగ్రెస్ పార్టీలు భాజపాపై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జనగామ చౌరస్తాలో కాంగ్రెస్, తెరాస ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని భాజపా శ్రేణులు అడ్డుకోవటంతో ఉద్రిక్తతకు దారితీసింది.
ఇరు పార్టీల శ్రేణులు ఒకరిపైఒకరు దాడి చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తెరాస, భాజపా శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేసుకున్నాయి. సహనం కోల్పోయిన భాజపా, తెరాస కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
- ఇదీ చదవండి : 'కాంగ్రెస్ అంటే ప్రధానికి భయం.. అందుకే విమర్శలు'