Bandi Sanjay Apology to Journalists: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో సాగుతోంది. ఈ క్రమంలో పాలకుర్తిలో ప్రజలనుద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. అదే సమయంలో.. బండి సంజయ్‌తో పాలకుర్తి జర్నలిస్టులు వాగ్వాదానికి దిగారు. తీవ్ర ఆగ్రహంతో బండి సంజయ్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అసలేమైందంటే..
బండి సంజయ్ ప్రసంగానికి ముందు.. స్థానిక భాజపా నేత నెమరుగముల వెంగళరావు మాట్లాడారు. ఆయన ప్రసంగంలో భాగంగా.. పాలకుర్తిలో జర్నలిస్టులకు మంజూరు చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. నెమరుగముల వెంగళరావు వ్యాఖ్యల పట్ట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పాలకుర్తి జర్నలిస్టులు.. అలా ఎలా అంటారంటూ ఆందోళన చేశారు. జర్నలిస్టులకు నచ్చజెప్పేందుకు బండి సంజయ్ ప్రయత్నించగా.. ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఇక చేసేదేమీలేక.. జర్నలిస్టులకు వెంగళరావు తరఫున సంజయ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
"జర్నలిస్టులపై అలా మాట్లాడటం ముమ్మాటికి తప్పే. ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను వినలేదు. మీ మనసులను బాధపెట్టినందుకు వెంగళరావు తరఫున నేను క్షమాపణ చెబుతున్నా. జర్నలిస్టుల తరఫున నిలబడే పార్టీ భాజపా. మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వంపై నేను పోరాడతా." - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చూడండి: