భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మినారాయణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, వరంగల్ భాజపా ఇంఛార్జి చంద్రయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం వరంగల్‌లో భాజపా కార్యాలయంపై తెరాస కార్యకర్తలు చేసిన దాడి ఘటనపై ఆరా తీయడానికి వరంగల్‌కు బయలుదేరిన వీరిని జనగామ జిల్లా పెంబర్తి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని లింగాలఘణపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్న తమను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి : భాజపా కార్యాలయంపై తెరాస శ్రేణులు దాడి