జనగాం జిల్లా పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో కరోనా వైరస్ కట్టడికి పోలీసులు వినూత్న ప్రచారం చేశారు. సీఐ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో చిందు యక్షగానం కళాకారులతో అవగాహన కల్పించారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా బారిన ఎలా పడతారో వివరించారు.
కరోనా వైరస్ వ్యాప్తి, నివారణకు దర్దేపల్లి గ్రామానికి చెందిన చిందు కళాకారుల బృందంతో పాలకుర్తిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణా, అర్జున, తదితర వేషధారణలో వీధివీధి తిరుగుతూ అవగాహన కల్పించారు. ఎస్సై గండ్రాతి సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే హత్యాయత్నం కేసు