పరిమితికి మించి ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడి ఒక మహిళ మృతి చెందిన ఘటన జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం నెలుట్ల వద్ద చోటుచేసుకుంది. జనగామ జిల్లా బచ్చనాపేట మండలం తమ్మడపల్లి గ్రామనికి చెందిన 14 మంది కూలీలు పత్తి చెనులో పనికోసం లింగాల ఘన్పూర్ మండలం కిష్టగూడెంకు ఆటోలో వెళ్తున్నారు. నెలుట్ల వద్ద కుక్క అడ్డంగా రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.
ఆటోలో ప్రయాణిస్తున్న బాదం మల్లమ్మ(55) అక్కడిక్కడే మృతి చెందగా, మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఇవీ చదవండి: కొనుగోళ్లు ఆలస్యం... దళారులకే రైతుల విక్రయం..