జనగామలో కరోనా వ్యాప్తి రోజురోజుకు విస్తరిస్తోంది. తాజాగా మరో 10 కరోనా మందికి కరోనా సోకినట్టు డీఎంహెచ్ఓ మహేందర్ తెలిపారు. జనగామలో ఓ ఎరువుల దుకాణం యజమానికి పాజిటివ్ వచ్చినట్టు తెలిసిన తర్వాత... ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వ్యక్తులు 8 మందికి... వారి నుంచి మరో 8 మందికి కరోనా సోకిన విషయం విదితమే. వారి ద్వారా తాజాగా మరో 10 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కలెక్టర్ నిఖిల ఆదేశాల మేరకు... కొవిడ్-19 నిబంధనలు పాటించలేదని మున్సిపల్ కమిషనర్ ఎరువుల దుకాణం యజమానిపా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల బంగారు దుకాణాల యజమానులు జూన్ 30వరకు షాపులు తెరవొద్దని నిర్ణయించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉగ్రరూపం.. ఒక్కరోజే 546 కేసులు