దేవుళ్లు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తారని అందుకే వైద్యులు దైవ స్వరూపులు అని కొనియాడారు స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు తాటికొండ రాజయ్య. హరితహారంలో భాగంగా బుధవారం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు 'డాక్టర్స్ డే'ను పురస్కరించుకొని శాలువా, పూలమాలలతో రాజయ్యను సత్కరించారు. తనను ఆదరించిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలను ఎప్పటికీ మర్చిపోలేనని ఎమ్మెల్యే తెలిపారు. తాను ఏ స్థానంలో ఉన్నా వైద్యునిగా సేవలందించేందుకు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. వైద్య వృత్తిలో ఉన్న సంతృప్తి మరే ఇతర వృత్తిలోనూ దొరకదని వివరించారు.
ఇదీ చూడండి : ఓ ఆచార్యుడు సృష్టించిన వనం.. 10 నెలల్లోనే హరితయజ్ఞం..