ETV Bharat / state

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎంఈవో - janagama

జనగామ జిల్లా బచ్చన్నపేట మండల విద్యాశాఖాధికారి ముత్తయ్య ఒక ప్రధానోపాధ్యాయుని వద్ద నుంచి 10 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు.

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎంఈఓ
author img

By

Published : Aug 5, 2019, 11:46 PM IST

జనగామ జిల్లా బచ్చన్నపేట మండల విద్యాశాఖాధికారి ముత్తయ్య 10 వేలు లంచం తీసుకుంటూ... అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణారెడ్డి గతనెల జులై 16, 17 తేదీల్లో అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లాడు. అదే రోజు పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో... తనకు చెప్పకుండా సెలవు తీసుకున్నందుకు రికార్డులో గైర్హాజరు వేశాడు.
మరుసటి రోజు జిల్లా విద్యాశాఖాధికారి తనిఖీ చేయగా... సమాచారం ఇవ్వకుండా సెలవు తీసుకున్నాడని చెప్పాడు. డీఈవో కూడా రికార్డుల్లో రిమార్కు రాశాడు. సస్పెండ్ చేయకుండా ఉండేందుకు కృష్ణారెడ్డి నుంచి ముత్తయ్య 25 వేలు డిమాండ్ చేశాడు. కృష్ణారెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం... సోమవారం ఉదయం 10 గంటలకు ముత్తయ్యకు 10వేలు నగదు ఇస్తుండగా పట్టుకున్నారు. విచారించి ఏసీబీ కోర్టులో హాజరు పరుచుతామని అనిశా అధికారులు తెలిపారు.

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎంఈఓ

ఇదీ చూడండి : ప్రజావాణికి తరలొచ్చిన ప్రజలు

Intro:tg_wgl_61_05_acb_ki_chikkina_meo_ab_ts10070
nitheesh, janagama, 8978753177
జనగామ జిల్లా బచ్చనాపేట మండల విద్యాశాఖాధికారి ముత్తయ్య ఒక ప్రధానోపాధ్యాయుని వద్ద 10 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అవినీతి నిరోధక శాఖ డీసీపీ వివరణ ప్రకారం నాగిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడైనా కృష్ణరెడ్డి గతనెల జూలై 16, 17వ తేదీలలో అనారోగ్య కారణాలతో సెలవు పై వెళ్ళగా అదే రోజు పాఠశాలను తనిఖీ చేయడానికి ఎంఈఓ ముత్తయ్య వెళ్లడంతో తనకు చెప్పకుండా సెలవు తీసుకున్నందుకు పాఠశాలల రికార్డు లో ఆబ్సెంట్ నమోదు చేశాడు. తిరిగి మరుసటి రోజు జిల్లా విద్యాశాఖాధికారి తనిఖీ చెయ్యడంతో తనకు చెప్పకుండా వెళ్లాడని ఎంఈఓ చెప్పడంతో తను కూడా పాఠశాల రికార్డు లో రిమర్క్స్ రాసి వెళ్ళడాని, దింతో ఎంఇఓ తిరిగి పాఠశాలకు వచ్చిన ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయకుండా ఉండాలంటే లంచంగా 25వేల రూపాయలు ఇస్తే వదిలేస్తానని తెలపడంతో అవినీతి నిరోధక శాఖ సమాచారం అందించడంతో వారు సోమవారం ఉదయం 10వేల రూపాయల లంచం ఇస్తుండగా వలపన్ని పట్టుకున్నట్లు తెలిపారు.విచారణ పూర్తి చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుచుతామని తెలిపారు.
బైట్: ప్రతాప్ dsp, అవినీతి నిరోధక శాఖ

Body:1

Conclusion:2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.