జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన మరాఠీ అరవింద్ అనే విద్యార్థి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే అరవింద్ ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం గల 195 దేశాలు, వాటి రాజధానులను 2నిమిషాల 12సెకన్లలలో చెప్పి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు.
అంతకుముందు ఉన్న 2నిమిషాల 29సెకన్లలను అధిగమించి అరవింద్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అరవింద్ గత 15 రోజుల ముందు 2నిమిషాల 28సెకన్లలలో చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులోనూ చోటు సంపాదించుకున్నాడు. దీంతో స్థానికులతో పాటుగా తోటి స్నేహితులు శెభాష్ అరవిందని మెచ్చుకుంటున్నారు. కన్న కొడుకు మేథాశక్తిని చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.
ఇదీ చదవండి: ప్రధానితో భేటీకి 14 మంది జమ్ము నేతలకు ఆహ్వానం