గ్రామాల అభివృద్ధిని సర్పంచ్లు సవాలుగా తీసుకొని ముందుకు వెళ్లాలని, కేసీఆర్ చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, విధులను ప్రభుత్వం కల్పించిందని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిస్వార్థంతో పని చేయాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామానికి వార్షిక ప్రణాళిక రూపొందించుకోవాలని, అన్ని గ్రామాలు, పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ప్రజా ప్రతినిధులు నిస్వార్థంతో పనిచేయాలి: మంత్రి ఎర్రబెల్లి - జనగామ జిల్లా
సీఎం కేసీఆర్ చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.