ETV Bharat / state

'విశాఖ ఉక్కుపై మాట్లాడే కేటీఆర్‌కు మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీలు కనిపించడం లేదా' - Sharmila comments on KtR rule

YS Sharmila fire on KTR: ఎన్నికల్లో గెలిపిస్తే చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత చెరుకు రైతులను పట్టించుకోకుండా మోసం చేశారని.. వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల తెరాస ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు కేసీఆర్ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి.. గెలిచిన తర్వాత హామీలను నిలబెట్టుకోకపోవడం మోసపూరితమని ఆమె విమర్శించారు.

YS Sharmila  comments on  KTR
YS Sharmila comments on KTR
author img

By

Published : Oct 29, 2022, 9:58 PM IST

కేటీఆర్​పై విమర్శలు గుప్పించిన..వైయస్​ షర్మిల..

YS Sharmila fire on KTR: చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత చెరుకు రైతులను పట్టించుకోకపోవడం మోసపూరిత చర్యని.. వైఎస్ షర్మిల ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విశాఖ ఉక్కుపై మాట్లాడే కేటీఆర్‌కు.. తెలంగాణలో మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీలు కనిపించడం లేదా అని మండిపడ్డారు. ఎన్నికల ముందు కేసీఆర్ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి.. గెలిచిన తర్వాత హామీలను నిలబెట్టుకోకపోవడం ప్రజలను మోసం చేయడమేనని దుయ్యబట్టారు.

మోసపూరిత ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని.. సమయం వచ్చినప్పుడు ప్రజల తడాఖా చూపించాలని సూచించారు. పాదయాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వద్ద వైఎస్సార్​ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.