ETV Bharat / state

"శ్రావణీస్​ కిచెన్​".. తెలంగాణ యూట్యూబర్ సక్సెస్​ స్టోరీ..​ - శ్రావణీస్ కిచెన్ వార్తలు

Sravani's Kitchen: పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని మరోసారి నిరూపించారు.. శ్రావణి గూడ. తనది అందరిలాగే.. పిల్లలతో తీరిక లేని సమయం. కానీ వాళ్లు స్కూలుకు వెళ్లాక.. సరదాగా వంటలు చేసి యూట్యూబ్​లో పోస్టు చేసేది. ఇప్పుడదే ఆమెను ఓ స్టార్​ను చేసింది. తెలుగులో అత్యధిక సబ్‌స్క్రైబర్లున్న ఛానెళ్లలో ఆమె "శ్రావణీస్‌ కిచెన్‌" ఒకటి. ఇదంతా ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే.. శ్రావణి కథ చదవాల్సిందే.

youtube-channel-sravanis-kitchen-success-story

author img

By

Published : Jun 26, 2022, 9:11 AM IST

Sravani's Kitchen: పట్టుదలకు శ్రమతోడైతే మనకున్న నైపుణ్యాలతోనే ఎంతో సాధించవచ్చు అనడానికి నిదర్శనం శ్రావణి గూడ. చదువుకునే రోజుల్లో ఇంట్లో వంటా వార్పూ తనదే. సరదాలూ షికార్ల సంగతలా ఉంచితే అసలు తీరికే దొరికేది కాదు. అప్పుడు నేర్చుకున్న నైపుణ్యాలే ఇప్పుడామెను యూట్యూబ్‌ స్టార్‌గా నిలిపాయి. తెలుగులో అత్యధిక సబ్‌స్క్రైబర్లున్న ఛానెళ్లలో ఆమె ‘శ్రావణీస్‌ కిచెన్‌’ ఒకటి. ఇదెలా సాధ్యమైందో ఆమె మాటల్లోనే..

పెళ్లైన కొత్తలో ఇంటి బాధ్యతలు. తర్వాత పిల్లలు.. టైమ్‌ ఉండేది కాదస్సలు. పిల్లలు స్కూల్‌కి వెళ్లడం మొదలు పెట్టాక చాలా ఖాళీ దొరికేది. ఇంట్లో ఉండే ఏం చేయొచ్చా అని ఆలోచించా. వంటలు బాగా చేస్తానని మావాళ్లంటారు. అందుకని యూట్యూబ్‌ ఛానెల్‌ పెడతాననగానే మావారు ప్రోత్సహించారు. 2016లో ‘శ్రావణీస్‌ కిచెన్‌’ని మొదలుపెట్టా. ఫోన్లోనే వీడియోలు తీసేదాన్ని. ఎడిటింగ్‌ మావారే నేర్పించారు. కానీ ఇంటి పనుల ఒత్తిడిలో కొనసాగించలేకపోయా.

2018 నుంచి మాత్రం టిఫిన్‌, లంచ్‌, డిన్నర్‌, స్నాక్స్‌కి ఇంట్లో ఏం చేస్తే అవి వీడియో తీసి పెట్టేదాన్ని. 2020 ఫిబ్రవరికి 7-8 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉండేవారు. లాక్‌డౌన్‌ మొదలయ్యాక ఏప్రిల్‌కల్లా ఆ సంఖ్య పది లక్షలకు చేరింది. గోల్డ్‌ ప్లే బటన్‌ వచ్చింది. తెలుగు వంటల ఛానెళ్లలో ఆ ఘనత అందుకున్న తొలి మహిళని నేనే. వీడియోలో కనిపించాలంటే నాకు కాస్త బెరుకుండేది.

ఈ మైలురాయి చేరుకున్నాక ‘నువ్వు వీక్షకులకి కనిపించాల్సిందే’నన్నారు మావారు. అలా ఆయన ఒత్తిడితో మొదటిసారి నా పరిచయ వీడియో చేశా. ఇక అప్పటినుంచి కనిపిస్తూనే వంటల్ని వివరిస్తున్నా.

వంట అలా అలవాటైంది.. మాది జగిత్యాల జిల్లా కోరుట్ల.. నా చిన్నపుడు ముంబయిలో ఉండేవాళ్లం. నాకిద్దరు అక్కలు, అన్నయ్య. అక్కలిద్దరూ చదువుకోలేదు. చిన్నదాన్ని కదాని నన్ను చదివించారు. నేను ఇంటర్లో ఉండగా అక్కల పెళ్లి ప్రయత్నాల కోసం వాళ్లని తీసుకుని అమ్మ ఊరు వచ్చేసింది. దాంతో ఇంటి పనీ, నాన్న, అన్నయ్య, నాన్నమ్మలకి వంటా నేనే చేసేదాన్ని. వాళ్లకోసమే వంటలు నేర్చుకున్నా. రోజూ ఒకేలాంటివి చేస్తే నాకే బోర్‌ కొట్టేది.. ఇక తినేవాళ్ల సంగతేంటి అనిపించేది. దాంతో కొత్త వంటల గురించి చుట్టుపక్కల తెలుగువాళ్లతోపాటు మరాఠీ వాళ్లని అడిగి చేసేదాన్ని. అవి తిని వాళ్లూ మెచ్చుకునేవారు. డిగ్రీ అవ్వగానే పెళ్లి కావడంతో హైదరాబాద్‌ వచ్చా. మావారు రాజేశ్‌... మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.

మార్పుతోనే సాధ్యం.. ఏ వంటకమైనా చక్కగా అర్థమయ్యేలా చెబుతూనే వీడియోని 5-6 నిమిషాలకు కుదించి పెడతా. ఇంట్లో రోజూ అవసరమయ్యే కూరలూ, టిఫిన్లు, స్నాక్స్‌ వీటినే రుచికరంగా, త్వరగా ఎలా చేసుకోవాలో చెబుతా. అవెన్‌ లేకుండా కేక్‌, బ్రెడ్‌.. మిక్సీ లేకుండా ఇగురు తయారీ.. లాంటివీ చేసి చూపిస్తా. ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌ వీడియోతో మంచి గుర్తింపు వచ్చింది. మొదటి లాక్‌డౌన్‌ సమయంలో పిల్లల కోసం పానీపూరీ చేశా. ఇంట్లోనే పూరీల్ని మైదాతో కాకుండా గోధుమపిండితో చేశా. ఆ వీడియోకి 1.6 కోట్లు, టొమాటో రైస్‌ తయారీ వీడియోకి 1.2 కోట్ల వీక్షణలు వచ్చాయి. నెలకు లక్షమంది సబ్‌స్క్రైబ్‌ చేసుకునేవారు.

ఈ ప్రయాణంలో ఇబ్బందుల్లేవా అంటే.. ఉన్నాయి. నేనేమీ సుశిక్షితురాలైన వ్యాపారవేత్తని కాదు... ఒక్కో అంశాన్నీ గమనించుకుంటూ... నేర్చుకుంటూ, మెరుగు పరుచుకుంటూ వస్తున్నా. మొదట్లో తెలుగు స్పష్టంగా మాట్లాడలేక ఇబ్బంది పడ్డా. వీక్షకుల సూచనలతోనే భాషని మెరుగుపర్చుకున్నా. మాటల్లేకుండా ఇంగ్లిష్‌ సబ్‌టైటిల్స్‌తో పెట్టేదాన్ని. పెద్దగా చూసే వారు కాదు. దాంతో తెలుగులోనే చెప్పడం మొదలుపెట్టా. వీడియో డిస్క్రిప్షన్‌ తెలుగులోనే రాసేదాన్ని. ఆ తర్వాత వీక్షణలు బాగా పెరిగాయి. అప్పట్లో రోజుకో వీడియో పెట్టేదాన్ని. ఇప్పుడు నాణ్యత మీద దృష్టి పెట్టి వారంలో 2-3 మాత్రమే పెడుతున్నా. వీక్షకుల నమ్మకం సంపాదించడం ముఖ్యం. వంటకం కొన్నిసార్లు బాగా రాకపోవచ్చు. అలాంటప్పుడు దాన్ని పోస్ట్‌ చేయకపోవడమే మంచిది. ప్రతి వీడియో విలువైనదే అనుకుంటూ చేస్తా. ప్రస్తుతం 32 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కోటికి చేరడమే నా లక్ష్యం!

మొదట ఇల్లాలినే..

పిల్లలు 3, 4 తరగతులు చదువుతున్నారు. నేను మొదట ఇల్లాలిని... ఆ తర్వాతే ఏదైనా. టైమ్‌ ఉన్నపుడే అదనపు వీడియోల్ని తీసి పెట్టుకుంటా. తీరికలేనపుడు వాటిని రిలీజ్‌ చేస్తా. పండగలకూ, ప్రత్యేక సందర్భాలకీ ఇలానే చేస్తా. వ్లాగ్స్‌ చేద్దామనుకున్నా కానీ కుదరడం లేదు. వీలైనప్పుడు ‘షార్ట్స్‌’ మాత్రం పెడుతున్నా. అమెజాన్‌, ఐటీసీ, నెస్లే లాంటి పెద్ద సంస్థలు ప్రచారానికి సంప్రదిస్తున్నాయి. ఛానెల్‌ వల్ల ఇంట్లో ఆదాయం రెట్టింపు అయింది. దానికన్నా ముఖ్యంగా నా ఆత్మవిశ్వాసం ఎన్నో రెట్లు పెరిగింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.