జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన గుంటుక దివ్య అనే మహిళ డిగ్రీ పూర్తి చేసింది. పెళ్లి చేసుకుని భర్తతో కలిసి థాయిలాండ్ వెళ్లింది. అక్కడ కాలుష్యంతో తీవ్ర ఇబ్బంది పడ్డ ఆమె... ఇంట్లో మొక్కల పెంపకాన్ని చేపట్టింది.
కొన్నాళ్ల తర్వాత స్వదేశానికి వచ్చిన ఆమె మొక్కల పెంపకాన్నే వ్యాపారంగా మలుచుకుంది. జగిత్యాల సాయిబాబా ఆలయ సమీపంలో నర్సరీని ప్రారంభించింది. 150 రకాల గృహాలంకరణ మొక్కలను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతోంది.
స్థానికంగా దొరికే మొక్కలే కాకుండా థాయిలాండ్ నుంచి కూడా కొన్ని మొక్కలను తెప్పిస్తోంది దివ్వ. రూ.50ల నుంచి రూ.12వేల విలువ గల మొక్కలను వినియోగదారులు ఎక్కువగా.. గృహాలంకరణలో భాగంగా.. కొనుగోలు చేస్తున్నారు.
- ఇదీచూడండి.ఊహా లోకం.. ఊహించని పైకం!