జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్లలో విషాదం చోటు చేసుకుంది. ఆసరి గంగాధర్ వ్యవసాయ పనులను ముగించుకుని ఇంటికి వచ్చి దుస్తులు ఉన్న తీగ వద్దకు వెళ్లాడు. తీగకు విద్యుత్ సరఫరా కావడం వల్ల విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడే ఉన్న భార్య లక్ష్మి భర్తను కాపాడుడే ప్రయత్నంలో ఆమె కూడ షాక్కు వచ్చి ఇద్దరు మృతి చెందారు. మృతులకు ముగ్గురు సంతానం.. మొదటి కుమార్తె వివాహం జరగగా మరో కుమార్తె, కుమారుడు చదువుకుంటున్నారు. అమ్మనాన్నల మృతదేహాల వద్ద పిల్లలు రోదిస్తున్న దృశ్యం అక్కడి వారిని కలచివేసింది.
ఇవీ చూడండి: గూగుల్ డూడుల్ పోటీలో గెలిస్తే రూ.5 లక్షలు