జగిత్యాల జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. రాయికల్ మండల కేంద్రంలో అనంతుల అశోక్, భార్య లత కరోనాతో మృత్యువాత పడ్డారు. వారం క్రితం దంపతులిద్దిరికీ కొవిడ్ సోకింది. ఇద్దరూ హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు.
దంపతుల మృతితో మండలకేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వరుస మరణాలతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.
ఇదీ చదవండి: క్యాబ్ సర్వీస్‌ను సద్వినియోగం చేసుకోవాలి: రాచకొండ సీపీ