జగిత్యాల గ్రామీణ మండలం చల్‌గల్‌లో విషాదం చోటుచేసుకుంది. మూడు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందారు. గ్రామానికి చెందిన పందిరి భీమలింగం మూడు రోజుల క్రితం మృతి చెందగా.. అతని భార్య లక్ష్మి ఈ రోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
గ్రామంలో ఇప్పటికే 11 మంది కరోనా సోకి మృతి చెందగా మరో 100 మంది వరకు గ్రామంలో కొవిడ్ సోకి చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరగటంతో గ్రామస్థులు భయందోళనలకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా 3వేల మందికి పైగా బ్యాంకు ఉద్యోగులకు కరోనా