ఓటు విలువ తెలియజేసేందుకు... జగిత్యాలలో జ్యోతి హైస్కూల్ ఉపాధ్యాయురాళ్ళు ముగ్గు వేసి ఓటు విలువ తెలియజేశారు.. నిజాయితీగా ఓటేయండి... ఓటు వేయి... నీ దేశాన్ని కాపాడుకో... నా ఓటు.. నా హక్కు.. డబ్బుకు అమ్ముడు పోకు... అనే నినాదంతో ఈ ముగ్గును వేశారు. ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ముగ్గుతో యువతకు, పట్టణ ఓటర్లకు సందేశాన్ని తెలిపారు. మంచి నాయకుడిని ఎన్నుకోవాలని వారు కోరారు. ముగ్గు మధ్యలో బ్యాలెట్, ఈవీఎం గుర్తును కూడా వేశారు.
ఇవీ చూడండి : బస్తీమే సవాల్: జగిత్యాల పీఠం హస్తగతమా... గులాబీమయమా...?