సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. మహిళలు, యువతులు, చిన్నారులకు.. విభాగాల వారికి ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు.
పెద్ద ఎత్తువ మహిళలు పాల్గొని రంగు రంగుల ముగ్గులు వేసి అలరించారు. తెలుగు సాంప్రదాయం పండగ విశిష్టత ప్రతిబింబించేలా ముగ్గులు వేసి ఔరా అనిపించారు.
వాటిలో మేటిగా ముగ్గు వేసిన వారిని ఎంపికచేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున మహిళలు యువతులు తరలివచ్చారు.
ఇదీ చూడండి: భారత్లో 100 దాటిన కొత్త రకం కరోనా కేసులు