కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేయరాదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ తెలిపారు. ప్రభావం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లాలోని జేఎన్టీయూ, పొలాస వ్యవసాయ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ.. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, పోలీసు సిబ్బందిని అభినందించారు.
కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం బాగా పనిచేసినందునేే.. వైరస్ గ్రామాలకు చేరలేదన్నారు.
జగిత్యాల పర్యటనలో వినోద్ వెంట కలెక్టర్ రవి, చొప్పదండి, జగిత్యాల ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత ఉన్నారు.
ఇవీ చూడండి: కరోనా ఎఫెక్ట్: మాస్క్‌లో సీఎం కేసీఆర్ సమీక్షలు