కరోన వైరస్ వ్యాప్తిపై ప్రజలలో ఆందోళన నేపథ్యంలో వచ్చిన ఉగాది పట్ల జగిత్యాల జిల్లా మెట్ పల్లి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. నిత్యవసరాలు కొనుగోలు చేసేందుకు అధికారులు ఉదయం ఆరు గంటల నుంచి మూడు గంటల పాటు అనుమతించారు. దీంతో ప్రజలు ఒక్కొక్కరుగా వచ్చి నిత్యవసర సరుకులు తీసుకెళ్తున్నారు. మోటార్ సైకిల్ పై ఒకరి కన్నా ఎక్కువ వెళ్లకుండా పోలీసులు నియంత్రిస్తున్నందున అవసరం ఉన్న వ్యక్తి మాత్రమే ఇంటి నుంచి బయటకు వచ్చి సరుకులను కొనుగోలు చేస్తున్నారు.
కూరగాయల మార్కెట్లో రద్దీ తగ్గింది. దీంతోపాటు అధికారులు వ్యాధి నివారణ కోసం ప్రజలకు వివిధ పద్ధతుల్లో అవగాహన కల్పిస్తుండటం వల్ల ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో ప్రజలు లేక రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
ఇదీ చూడండి: భారత్ లాక్డౌన్: 21 రోజులు అందుబాటులో ఉండేవి ఇవే