జగిత్యాల పురపాలికను తెరాస కైవసం చేసుకుంది. ఈ జిల్లాలో 48 వార్డులు ఉండగా.. 30స్థానాల్లో కారు గుర్తు అభ్యర్థులు జయభేరి మోగించారు. కాంగ్రెస్ 7 వార్డులు దక్కించుకోగా.. భాజపా 3 కైవసం చేసుకుంది. ఇతరులు ఏడు స్థానాల్లో గెలుపొందగా.. మజ్లిస్ ఒక స్థానంతో సరిపెట్టుకుంది.
కోరుట్లలో కూడా గులాబీ గుబాళించింది. ఇక్కడ 33 వార్డులకు గాను 21 వార్డుల్లో గెలుపొందిన తెరాస.. పురపీఠాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకుంటే 5 వార్డుల్లో కమలం వికసించింది. అలాగే ఎంఐఎం పార్టీ 2, ఇతరులు 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. మెట్‌పల్లి మున్సిపాలిటీలో తెరాసదే హవా కొనసాగింది. మొత్తం 26 వార్డులకు 16 సాధించింది అధికార పార్టీ. భాజపా నాలుగు స్థానాలు గెలుచుకోగా 3 వార్డులు హస్తగతమయ్యాయి. ఇతరులు కూడా మూడు వార్డులు దక్కించుకున్నారు.
రాయికల్‌లో 12 వార్డులకు గాను.. తెరాస 9 స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. కాంగ్రెస్, భాజపా, ఇతరులు చెరో ఒక స్థానంతో సరిపెట్టుకున్నారు. ధర్మపురి పురపాలికను అధికార పార్టీ కైవసం చేసుకుంది. ధర్మపురిలో 15 వార్డులుంటే తెరాస 8 గెలుచుకోగా 7 స్థానాలతో గట్టి పోటీ ఇచ్చింది.
ఇవీ చూడండి: కారు జోరు.. తెలంగాణభవన్‌లో కార్యకర్తల ఊపు..