ఇవీ చూడండి:తెలంగాణ చిన్నమ్మ ఇకలేరు
యువతలో భరోసా నింపిన మహనీయురాలు - నివాళులు
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో భాజపా సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్‌కు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.
యువతలో భరోసా నింపిన మహనీయురాలు
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సుష్మా స్వరాజ్‌కు సంతాప కార్యాక్రమం నిర్వహించారు. తెలంగాణ చిన్నమ్మ చిత్రపటానికి కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ వెంకట్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నాడు పార్లమెంటులో రాష్ట్రం ఏర్పాటుకు సుష్మా స్వరాజ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. పార్లమెంటులో తెలుగులో మాట్లాడుతూ యువకుల ప్రాణాలు తీసుకోవద్దని తెలంగాణ తొందర్లోనే వస్తుందని చెప్పి యువతలో భరోసా నింపిన మహనీయురాలని గుర్తు చేసుకున్నారు.
ఇవీ చూడండి:తెలంగాణ చిన్నమ్మ ఇకలేరు
sample description