జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం పాత దాంరాజ్‌పల్లిలోని గోదావరి నుంచి ఇసుకను నిత్యం దర్జాగా ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. ఎప్పటిలాగానే ఇసుకను తీసుకువస్తుండగా గట్టు ఎక్కించబోయాడు. ఇంజిన్ ముందు భాగం ఒక్కసారిగా పైకి లేచి బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్ వికాస్ అక్కడిక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: పెద్దపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం.. ముగ్గురు మృతి