ETV Bharat / state

సోనియా పట్ల అలా ప్రవర్తించారు.. మరి కవిత విషయంలో ఇలా ఎందుకు: రేవంత్ రెడ్డి - షర్మిల తాజా వార్తలు

Revanthreddy on Delhi Liquor Scam : ఈడీ, సీబీఐ బీజేపీ జేబు దొంగలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ పట్ల వ్యవహరించినట్లు మద్యం కేసులో కవిత పట్ల ఎందుకు ప్రవర్తించట్లేదని మండిపడ్డారు. దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇరుక్కున్నారు కాబట్టే.. ఎమ్మెల్సీ కవితకు మహిళా రిజర్వేషన్​ గుర్తొచ్చిందని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.

Revanthreddy
Revanthreddy
author img

By

Published : Mar 10, 2023, 7:50 PM IST

Revanthreddy on Delhi Liquor Scam: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ పట్ల వ్యవహరించినట్లు మద్యం కేసులో కవిత పట్ల ఎందుకు ప్రవర్తించట్లేదని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. జగిత్యాల జిల్లా నర్సింగాపూర్‌లో ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న జలపతి రెడ్డి కుటుంబాన్ని రేవంత్‌ పరామర్శించారు. లిక్కర్‌ స్కామ్​ విషయంలో ఈడీ సరైన సమాచారం ఇవ్వట్లేదని తెలిపారు. కేసీఆర్ అవినీతికి పాల్పడినట్లు ప్రధాని సహా కేంద్రమంత్రులు వ్యాఖ్యానించారన్న రేవంత్‌... సీఎంపై ఎందుకు విచారణ చేయట్లేదని విమర్శించారు.

బండి సంజయ్‌ గతంలో మాదిరి గంగుల కమలాకర్‌పై పోటీ చేయకుంటే బీఆర్​ఎస్, బీజేపీల మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని ప్రజలు గుర్తిస్తారని వెల్లడించారు. అవినీతి ఆరోపణలు వచ్చిన రాజయ్యను బర్తరఫ్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి పేపర్ పులుల్లా టీవీల ముందు రంకెలేయొద్దని రేవంత్ ధ్వజమెత్తారు. బండి వ్యవహారం గురవిందగింజ చందంగా ఉందన్నారు.

'మద్యం కేసులో ఈడీ సరైన సమాచారం ఇవ్వట్లేదు. ఈడీ, సీబీఐ బీజేపీ జేబు సంస్థలు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియాతో బీజేపీ ఎలా ప్రవర్తించింది. మద్యం కేసులో కవిత పట్ల అలా ఎందుకు ప్రవర్తించట్లేదు. సీఎం కేసీఆర్ అవినీతిపై నేను ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు విచారణ చేపట్టలేదు? కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ప్రధాని, కేంద్రమంత్రులు చెప్పారు. మీకున్న కుమ్మక్కు రాజకీయాలు ఏమిటి ? వచ్చే ఎన్నికల్లో బండి, గంగులపై పోటీ చేయాలి. చీకటి ఒప్పందం కోసం బండి వేరే చోట పోటీ చేయాలని చూస్తున్నారు.'-రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

మద్యం కేసులో కవిత పట్ల అలా ఎందుకు ప్రవర్తించట్లేదు: రేవంత్ రెడ్డి

కేసీఆర్‌ ఇంటి ముందు దీక్ష చేయాలి: మహిళా రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తోన్న దీక్షపై హైదరాబాద్‌లో వైఎస్సాఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. బీఆర్​ఎస్​లోనే 33 శాతం రిజర్వేషన్ ఇవ్వట్లేదన్న షర్మిల.. కవిత దిల్లిలో కాకుండా కేసీఆర్‌ ఇంటి ముందు దీక్ష చేయాలని విమర్శించారు. హస్తినలో కవిత సోనియాను పొగడటం... ఇక్కడ మద్యం కుంభకోణంపై రేవంత్‌ మాట్లాడకపోవటం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే ఇరు పార్టీలు ఏకమవుతున్నట్టు కనిపిస్తోందని వెల్లడించారు.

కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్​లో అరెస్ట్ కానున్న నేపథ్యంలో.. మహిళా రిజర్వేషన్ బిల్లును తెరపైకి తీసుకొచ్చిందని బీఎస్పీ పార్టీ ఆరోపిస్తోంది. కవిత చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే దిల్లీలో ధర్నా చేపట్టిందని.. ఆ పార్టీ అధికార ప్రతినిధి వెంకటేశ్​ చౌహాన్ తెలిపారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తం అయ్యారని.. వారు చేస్తున్న అవినీతిని గ్రహిస్తున్నారన్నారు. మహిళల కోసం దిల్లీలో ధర్నా చేస్తున్న కవితకు చిత్తశుద్ధి ఉంటే.. బీఆర్​ఎస్ పార్టీ కార్యాలయంలో మొదట దీక్ష చేసి వారి పార్టీలో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. లిక్కర్ స్కామ్​లో దిల్లీ డిప్యూటీ సీఎంతో పాటు పలువురు అరెస్ట్ అయిన నేపథ్యంలో.. కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. తప్పు చేసినట్లు ఆధారాలు ఉన్నప్పుడు వెంటనే ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.