జగిత్యాల జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. కొడిమ్యాల వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో పిడుగుపాటుకు ఆరు వేల గన్ని సంచులు కాలిపోయాయి. ఇవాళ తెల్లవారుజామున సమయంలో ఈఘటన చోటు చేసుకుంది. ఆరు బయట నిలువ చేసిన గన్ని సంచులకు మంటలు వ్యాపించాయి.. ఫైర్ అధికారులు చేరుకునే లోపే నష్టం జరిగిపోయింది. కొన్ని సంచులు పాక్షికంగా దగ్ధమై నిరుపయోగంగా మారాయి.
సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రవిశంకర్.. కలెక్టర్ కు పరిస్థితిని వివరించారు. మరోసారి వర్షం పడితే ధాన్యం పూర్తిగా కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. రైతులు ఇబ్బంది పడకుండా సత్వరం గన్ని సంచులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: రాష్రంలో మొదటి కరోనా పాజిటివ్ వ్యక్తి ప్లాస్మా సేకరణ