జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో ముగ్గురు గొర్రెల కాపరులు గోదావరి మధ్యలో ఉన్న తిప్పమీదకు గొర్రెలను మేపడానికి వెళ్లారు. ఇంతలో వరద ఉద్ధృతి పెరగడం వల్ల అవతలే చిక్కుకుపోయారు. వేములకుర్తికి చెందిన బాస సోమయ్య, అల్లకుంట లక్ష్మయ్య, నేమురి ఆశన్న... తమ గొర్రెలను మేపడానికి వెళ్లి ప్రవాహంలో చిక్కుకుపోయారు.
విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వారితో మాట్లాడారు. అయితే గొర్రెలను తీసుకొచ్చే పరిస్థితి లేదని... వాటిని వదిలి వారు రామని చెప్పడంతో గ్రామస్థుల సహకారంతో వారికి అవసరమైన ఆహారం గజఈతగాళ్ల సాయంతో పంపించారు. ప్రవాహం తగ్గితేనే వాళ్లు ఇవతలకు వచ్చే అవకాశం ఉంది.
మండలంలోని వేములకుర్తికి చెందిన ముగ్గురు గొర్రెల కాపరులు వారికి చెందిన 350 గొర్రెలను తీసుకుని గోదావరి మధ్యనున్న పుర్రులో మేపడానికి వెళ్లారు. భారీ వర్షాలవల్ల గోదావరిలో ప్రవహాం పెరగడం వల్ల వారు అక్కడే ఉండిపోయారు. గొర్రెలను ఇవతలి ఒడ్డుకు తీసుకొచ్చే పరిస్థితి లేదు కాబట్టి.. గ్రామస్థుల సహాకారంతో వారికి అవసరమైన ఆహార పదార్థాలు పంపించాము. వరద తగ్గేవరకు వాళ్లు ఆవతలే ఉంటారు. శ్రీనివాస్, మెట్పల్లి సీఐ
ఇదీ చూడండి: live video: వరద ఉద్ధృతికి కూలిపోయిన బ్రిడ్జి సెంట్రింగ్..