జగిత్యాల జిల్లా సోమన్‌పల్లి గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. ముగ్గురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. లచ్చన్న, ఆభిలాష్, కొమురయ్యలు కుక్కల దాడిలో గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గ్రామంలో కుక్కల బెదడ తీవ్రమైందని, వాటి నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: రేపు మంత్రివర్గ సమావేశం... కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం