ETV Bharat / state

కరోనాతో వారం రోజుల్లో ఒకే ఇంట్లో ముగ్గురు మృతి

కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలోని ముగ్గురిని బలితీసుకుంది. వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు చనిపోవడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.

Three people died with corona
కరోనాతో వారం రోజుల్లో ఒకే ఇంట్లో ముగ్గురు మృతి
author img

By

Published : Apr 20, 2021, 4:05 PM IST

జగిత్యాల పట్టణం గణేశ్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో వారం రోజుల్లో ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందడం కలకలం రేపింది. వారంక్రితం రామచంద్రం కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. 5 రోజుల క్రితం అతని పెద్దకుమారుడు సునీల్‌ వైరస్‌ కాటుకు బలయ్యాడు. ఇవాళ చిన్న కుమారుడు సుమన్‌ కరోనాతో మృతి చెందాడు. ఒకే కుటుంబంలో వారం రోజుల వ్యవధిలోనే కొవిడ్‌ మహమ్మారికి ముగ్గురు ప్రాణాలు వదలడం స్థానికులను భయాందోళనకు గురుచేస్తోంది.

అంత్యక్రియలకు బంధువులెవరూ ముందుకు రాకపోవడం వల్ల.. వార్డు కౌన్సిలర్‌ మల్లవ్వ, ఆమె భర్త అంతిమసంస్కారాలు నిర్వహించారు. అదే ఇంట్లో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. రామచంద్రం పెద్ద కుమారుడు సునీల్‌ భార్య, ఇద్దరు పిల్లలకు వైరస్‌ సోకింది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.