bullet bandi song: జగిత్యాల మినీ స్టేడియం అంతర్జాతీయ రికార్డుకు వేదికైంది. వెయ్యిమంది విద్యార్థులు బుల్లెటు బండి పాటకు నృత్యం చేశారు. కళాకారుడు మచ్చురవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి... జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్, చొప్పదండి శాసనసభ్యుడు సుంకె రవిశంకర్, కలెక్టర్ రవి హాజరయ్యారు. ఇందులో చిన్నారులు, యువత పాటకు తగినట్లుగా అభినయించారు.
వెయ్యి మంది ఒకేసారి నృత్యం..
రాష్ట్రంలోని నలుమూలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. నెలరోజుల పాటు శిక్షణ తీసుకుని ప్రదర్శనలో పాల్గొన్నామని తెలిపారు. ఇందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇటీవల బుల్లెటుబండి పాటపై నృత్యం చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన పెళ్లికూతురు సాయి శ్రీ సైతం ప్రదర్శనలో పాల్గొన్నారు. వెయ్యి మంది ఒకేసారి నృత్యం చేస్తుండగా చూడటం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రపంచం రికార్డు సాధించటం మరిచిపోలేని అనుభూతిగా పేర్కొన్నారు.
కేవలం ఒక పాట కోసమే నిర్వహించిన నృత్య ప్రదర్శనకు అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. ప్రదర్శన అనంతరం నిర్వహకులు అవార్డు అందజేశారు.
ఇదీ చూడండి: