రక్తదానం ప్రాధాన్యత తెలిసిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఖయ్యూం అనే సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్... ఆపదలో ఉన్న రోగి కోసం కరీంనగర్‌కు వెళ్ళి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచాడు. మంగపేటకు చెందిన ఓ వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ ఉండగా... చికిత్స కోసం రక్తం అవసరమైంది. కరోనా కారణంగా ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
వాట్సప్ ద్వారా సమాచారమందుకున్న ఖయ్యూం... తన స్నేహితులతో కలిసి దాదాపు 70కిలోమీటర్లు ప్రయాణించి రక్తదానం చేశాడు. అత్యవసర సమయాల్లో ఏ ప్రాంతానికి అయినా వెళ్లి రక్తదానం చేయడానికి తాము నిరంతరం అందుబాటులో ఉంటామని 'ఖిద్‌మతే అవామ్' ప్రతినిధి ఖయ్యూం తెలిపారు. కరీంనగర్, జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల ప్రాంతాలకు వెళ్లి రక్తదానం చేస్తుంటామని... ఆపదలో ఉన్న వారికి రక్తం ఇవ్వడానికి యువకులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని ఖయ్యూం సూచించారు.
ఇదీ చూడండి : 'కరోనిల్' సేఫేనా? క్లినికల్ ట్రయల్స్ రిజల్ట్ ఏంటి?