జగిత్యాల జిల్లా కేంద్రంలో లక్ష్మణ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఓ వస్త్ర దుకాణానికి వెళ్లాడు. మళ్లీ తిరిగి వెళ్లే సమయంలో అక్కడ ఉన్నవారు.. ద్విచక్ర వాహనంలో పాము దూరిందని చెప్పారు. లక్ష్మణ్ వాహనాన్ని పరిశీలించగా.. పాము తోక కనబడింది. చుట్టుపక్కల జనం అంతా అక్కడ పోగయ్యారు.
పాము తోకను బయటకు తీస్తుండగా... తెగిపోయిన తోక ముక్క బయటికొచ్చింది. మిగతా పాము మోటార్ సైకిల్‌లోకి వెళ్లొచ్చని అనుకున్నారు. భయాందోళనకు గురైన లక్ష్మణ్ మెకానిక్‌ను పిలిపించి... వాహనం భాగాలన్నీ విప్పించాడు. అయినప్పటికీ పాము దొరకలేదు.
చివరికి పాము మోటార్ సైకిల్లో లేదని తెలుసుకున్నారు. కొన్ని రోజుల క్రితం పాము బండిలో దూరి పోగా.. తోక మధ్యలో ఇరుక్కొని తెగినట్లు గుర్తించారు.
చివరకు విషయం తెలుసుకుని బైక్ యజమాని లక్ష్మణ్ సహా అంతా అవాక్కయ్యారు. లక్ష్మణ్ విడిభాగాలను బిగించుకుని మోటార్ సైకిల్‌ను తీసుకెళ్లారు.
ఇదీ చూడండి: 'నా పేరు మధ్యప్రదేశ్.. నా కొడుకు పేరు భోపాల్'